శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:57 IST)

డ్రగ్స్ కేసు- హీరో నవదీప్‌కు పోలీసులు నోటీసులు జారీ

Navadeep
హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో హీరో నవదీప్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. గచ్చిబౌలిలోని స్నార్ట్‌ పబ్‌తో పాటు జూబ్లీహిల్స్‌ టెర్రా కేఫ్‌లో డ్రగ్స్‌ విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 
 
అయితే.. షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈయనతో పాటు పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
 
‘బేబి’ సినిమాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫైర్.. గతంలో డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ కబాలి తెలుగు వెర్షన్‌ ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరి లిస్ట్‌లోనూ మోడల్‌ శ్వేత పేరు ఉన్నట్టు సమాచారం. 
 
ఈమెతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్‌ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల లిస్ట్‌లో మరికొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఉన్నట్టు తెలుస్తోంది.