గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (12:22 IST)

బేబీ సినిమాలో హీరోయిన్ డ్రగ్ వాడకంపై అడ్వైజరీ నోటీస్ కు సాయి రాజేశ్ ఏమన్నారంటే!

vyshanavi- sai rajesh
vyshanavi- sai rajesh
సినిమా మేకింగ్ లో బాధ్యతగా ఉంటున్నామని అన్నారు చిత్ర దర్శకుడు సాయి రాజేశ్. యువత డ్రగ్స్ వలలో పడొద్దని, మాదక ద్రవ్యాల బారిన పడితే తిరిగి బయటకు రాలేరని ఆయన సూచించారు. బేబి సినిమాలో కథానుసారం రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని థియేటర్ , ఓటీటీలో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని ఆయన అన్నారు. యూట్యూబ్ కు సెన్సార్ లేనందున ఆడియో కంపెనీలు పాటలు ప్లే చేసినప్పుడు ఆ సూచన చేయలేదని సాయి రాజేశ్ చెప్పారు.

ఈ విషయమై పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ కాల్, అడ్వైజరీ నోటీస్ వచ్చిందని యూట్యూబ్ లో మాత్రమే డ్రగ్ సీన్ కు హెచ్చరిక వేయలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని సాయి రాజేశ్ అన్నారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దంటూ తన తరుపున, బేబి టీమ్ తరుపున కోరుతున్నట్లు సాయి రాజేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
 
ఈ వీడియోలో డైరెక్టర్ సాయి రాజేశ్ స్పందిస్తూ - మా బేబి సినిమా టీమ్ కు సీపీ గారి దగ్గర నుంచి అడ్వైజరీ నోటీస్ వచ్చింది. అది కేసు గురించి కాదు. బేబి సినిమాలో సీత, వైష్ణవి క్యారెక్టర్స్ మధ్య డ్రగ్ సీన్ ఉంది. చెడు స్నేహాల వల్ల యువత ఎలా తప్పుదారి పడుతున్నారు అనే కోణంలో ఆ సీన్ చిత్రీకరించాం. థియేటర్, ఓటీటీలో ఆ సీన్ వచ్చినప్పుడు డ్రగ్స్ వాడొద్దనే చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చాం. అయితే సాంగ్స్ ఆడియో కంపెనీస్ కు ఇచ్చినప్పుడు వారు ఆ హెచ్చరిక లేకుండా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ విషయాన్ని సీపీ గారికి వివరించాను. ఆయన దర్శకులు, రచయితలు, నటీనటులు డ్రగ్స్ వాడే సీన్స్ ను గ్లోరిఫై చేయొద్దని, డ్రగ్ సీన్స్ వచ్చేప్పుడు బ్లర్ వేయాలని సూచించారు. మా బేబి టీమ్ తరుపున యువతీ యువకులకు డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని కోరుతున్నాం. మా బేబి సినిమా టీమ్ ఈ విషయంలో బాధ్యతగా ఉంటుంది. అని అన్నారు.