ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:02 IST)

గం..గం..గణేశా ఫస్ట్ లుక్ తో ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda look
Anand Devarakonda look
"బేబీ" సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం "గం..గం..గణేశా" అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న"గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకున్నఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. "గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా ?, కామెడీ మూవీనా ? ..త్వరలో మనం తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్, ఎగ్జైటింగ్ అప్ డేట్స్ రాబోతున్నాయి. అని క్యాప్షన్ రాశారు.
 
ప్రస్తుతం "గం..గం..గణేశా" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.