శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బికినీలకు దూరంగా ఉంటానంటున్న ఢిల్లీ భామ

తెలుగు చిత్రపరిశ్రకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్పీ పన్ను. ఈ భామకు సినీ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌‍కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల విహారయాత్ర కోసం మాల్దీవులు వెళ్లిన తాప్సీ అక్కడ బికినీలో ఫోజులిచ్చి అభిమానుల్ని ఫిదా చేసింది. 
 
అయితే ఈ బికినీ అందాలన్నీ ఆఫ్‌ స్క్రీన్‌కే పరిమితమని అంటోంది. వెండితెరపై బికినీలో అస్సలు కనిపించనని చెప్పింది. అలాంటి అతి కురచ దుస్తుల్లో తనను అభిమానులు ఊహించుకోలేరని పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'జుద్వా' మినహా మరే సినిమాలోను బికినీలో కనిపించలేదు. గ్లామర్‌ ఫొటోల్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడానికి ఇష్టపడను. మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తే అభిమానులు నన్ను స్వీకరించరని తెలుసు. అందుకే సినిమాల్లో ఇకపై బికినీ ధరించకూడదని నియమం పెట్టుకున్నా’ అని తెలిపింది.