శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (17:10 IST)

త్వరలోనే 'ఓబులమ్మ'గా మీ ముందుకు వస్తానంటున్న రకుల్

కరోనా వైరస్ బారినపడిన సినీ సెలెబ్రిటీల్లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కరోనా వైరస్ బారినపడిన ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 
 
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. కొవిడ్ నుంచి బయటపడటానికి తాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన గదిలోంచి అస్సలు బయటకు రావడం లేదన్నారు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
అంతేకాకుండా, విటమిన్‌ మాత్రలు వేసుకుంటున్నానని, అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలతో త్వరలోనే కరోనాను అధిగమించి అందరి ముందుకు వస్తాననే విశ్వాసం ఉందని వీడియాలో చెప్పింది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 
 
కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో నటించింది. చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో ఆమె రాయలసీమకు చెందిన పల్లెటూరి యువతి 'ఓబులమ్మ' పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో పాటు నితిన్‌ 'చెక్' మూవీలో రకుల్‌.. న్యాయవాది పాత్ర పోషిస్తోంది.