శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:19 IST)

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు కరోనా పాజిటివ్ (video)

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా ఆమె చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రకుల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తెలిపింది. 
 
'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ'ని రకుల్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, కరోనా సోకిందని తెలిసిన వెంటనే రకుల్ ప్రీత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉండగా, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది.