ఐస్‌క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం... నాగ చైతన్యతో కలిసి సమంత
ఈమధ్య ఐస్‌క్రీమ్ అంటే తనకిష్టమని.. నాగ చైతన్యతో కలిసి తిన్న ఓ స్టిల్‌ను సోషల్ మీడియాలో పెట్టిన సమంత... ఇప్పుడు మరో రహస్యాన్ని చెబుతోంది. ఈమె రహస్యం అనుకుంటున్నా.. అది అప్పటికే సోషల్ మీడియాలో తెలిసిపోయింది. ఇటీవలే జిమ్‌లో సమంత ఫిట్‌నెస్ కోసం బరువు
ఈమధ్య ఐస్‌క్రీమ్ అంటే తనకిష్టమని.. నాగ చైతన్యతో కలిసి తిన్న ఓ స్టిల్‌ను సోషల్ మీడియాలో పెట్టిన సమంత... ఇప్పుడు మరో రహస్యాన్ని చెబుతోంది. ఈమె రహస్యం అనుకుంటున్నా.. అది అప్పటికే సోషల్ మీడియాలో తెలిసిపోయింది. ఇటీవలే జిమ్‌లో సమంత ఫిట్‌నెస్ కోసం బరువులు మోస్తున్న వీడియో బాగా హల్‌చల్ చేసింది.
సమంత ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన రాజేష్ రామస్వామి మాట్లాడుతూ.. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ జిమ్‌కు 15 నిమిషాల ముందే చేరుకుంటుందని అన్నారు. తెల్లవారు జామున షూటింగ్ ఉన్నప్పటికీ జిమ్‌ని మిస్ అవ్వదని అన్నారు. అలా అని తిండి విషయంలో ఏమాత్రం రాజీపడదు. ఇడ్లీ, దోశ, వడ మరియు చికెన్ వంటి వంటకాలను తినడానికి ఏమాత్రం ఆలోచించదని అన్నారు. ఇక మంచినీరు, ఫ్రూట్స్, జ్యూస్‌లు వంటివి బాగా తాగుతుందని అన్నారు.