1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 31 మార్చి 2017 (02:25 IST)

ఆ సమయంలో నన్ను మామూలుగా తొక్కలేదు.. ఎవరు? ఎవరిని?

ఆ సినిమా విడుదలై నాలుగే్ళ్లు పూర్తయినా ఆయన కోపం తగ్గలేదు. ఒక సమయంలో తనను పెట్టే వేధింపులు తట్టుకోలేక దేశమే వదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతానని కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. దేశంలో అత్యంత గొ్ప్ప నటుల్లో ఒకరైన తను ఎట్టకేలకు తనకు ఎదురైన సంక్షోభం నుంచ

ఆ సినిమా విడుదలై నాలుగే్ళ్లు పూర్తయినా ఆయన కోపం తగ్గలేదు. ఒక సమయంలో తనను పెట్టే వేధింపులు తట్టుకోలేక దేశమే వదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతానని కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. దేశంలో అత్యంత గొ్ప్ప నటుల్లో ఒకరైన తను ఎట్టకేలకు తనకు ఎదురైన సంక్షోభం నుంచి బయటపడ్డాడు కానీ ఆలస్యంగా విడుదలైన ఆ చిత్రం 60 కోట్ల లాస్‌తో ముగిసిపోయింది. అందుకే ఆ పెద్ద నటుడికి ఇప్పటికీ తల్చుకుంటే కోపం వస్తూనే ఉంటుంది.
 
ఆ నటుడు కమల్ హసన్, ఆ సినిమా విశ్వరూవం. ఆ వేధింపులు తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చినవి. ఆ సినిమా ముస్లింల మనోభావాలను కించపర్చే విధంగా ఉందంటూ 2013లో జయలలిత ప్రబుత్వం చిత్ర విడుదలను అడ్డుకుంది. అంతకుముందే కొన్ని సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకున్నా సరే కమల్‌కు ఇక్కట్లు తప్పలేదు. జయ ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా వర్గాలు తీవ్రంగా ఖండించడం, అభిమానులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి విశ్వరూపం చిత్రంపై నిషేధం ఎత్తివేసినా సినిమా లాస్‌తోనే ముగిసింది. చిన్న లాస్ కాదు 60 కోట్ల రూపాయల భారీ నష్టం. 
 
నాలుగేళ్ల తర్వాత విశ్వరూపం 2 విడుదల కానున్న సమయంలో కమల్ పాత జ్ఞాపకాల గాయాలను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రభుత్వం దన్నుతో తనను అణగదొక్కాలని చూశారని, కానీ సినీరంగంలోని మిత్రులు, ప్రజలు, అభిమానులు తిరగబడ్డంతో విశ్వరూపం 1 పై నిషేధం తొలగించారని కమల్ చెప్పారు. త్వరలో విడుదల కానున్న విశ్వరూపం 2 కి ఎలాంటి సమస్యలూ రావనే భావిస్తున్నట్లు కమల్ చెప్పారు.
 
తనను ముప్పుతిప్పలు పట్టించిన జయలలితపై ఆమె మరణానంతరం కూడా కమల్‌కు కోపం తగ్గలేదు. ఆమె పార్థివ కాయాన్ని దర్సించలేదు. పైగా ఆమెకు వ్యతిరేకంగా అభిమానులను రెచ్చగొడుతూ ట్వీట్లు చేశాడు. నిజమే మరి. ఆయనను ఆనాడు ఎంతగా తొక్కాలనున్నారంటే.. ఇప్పటికీ మర్చిపోలేనంతగా వేధించారు.