శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (17:41 IST)

తైమూర్ అంటే ''ఇనుము'' అని అర్థం.. స్పెల్లింగ్‌లో తేడా ఉంటుంది: సైఫ్ దంపతులు

బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌‍ దంపతులు తమ బిడ్డకు తైమూర్ అనే పేరు పెట్టడంపై స్పందింటారు. టర్కీని పాలించిన తైమూర్ గురించి తెలిసి కూడా సైఫ్ అలీ ఖాన్ ఆ పేరు పెట్టడం ఎందుకని ఫ్యాన్స్ అంటున్నారు.

బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌‍ దంపతులు తమ బిడ్డకు తైమూర్ అనే పేరు పెట్టడంపై స్పందింటారు. టర్కీని పాలించిన తైమూర్ గురించి తెలిసి కూడా సైఫ్ అలీ ఖాన్ ఆ పేరు పెట్టడం ఎందుకని ఫ్యాన్స్ అంటున్నారు. తమ మగబిడ్డకు ‘తైమూర్’ అనే పేరు పెట్టడంపై నెటిజన్లు ఎంతటి రాద్ధాంతం చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంట తమ బిడ్డకు తైమూర్ అనే  పేరు పెట్టడంపై స్వేఛ్ఛ నివ్వాలన్నారు. 
 
ఇంకా సైఫ్ అలీ ఖాన్ స్పందిస్తూ తనకు, తన భార్యకూ ఈ పేరు చాలా నచ్చిందన్వారు. తైమూర్ అంటే టర్కీని పాలించిన తైమూర్ గురించి తనకు తెలుసునని... టర్కీ తైమూర్ పేరుకు, తమ అబ్బాయికి పెట్టిన తైమూర్ పేరుకి స్పెల్లింగ్‌లో తేడా ఉంటుందని చెప్పాడు. తమ చిన్నారి  పేరు ‘టీఏఐ’ స్పెల్లింగ్ తో ఉంటుందన్నారు. పర్షియా భాషలో ఈ పదానికి అర్థం ‘ఇనుము’ అని చెప్పుకొచ్చాడు.