శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 జూన్ 2017 (15:24 IST)

నేను ఎంత ఓపెన్ చెయ్యమని చెప్పినా ప్రభాస్ ఓపెన్ చేయడంలేదు... ఏం చేసేది?

సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో కొంతమంది నటీనటులు మాత్రమే యాక్టివుగా వుంటారు. చాలామంది ఎందుకొచ్చిన రచ్చ అంటూ వాటి జోలికి వెళ్లరు. ఐతే బాహుబలి చిత్రం సక్సెస్ కావడంతో ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల కోసం అభిమాను

సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో కొంతమంది నటీనటులు మాత్రమే యాక్టివుగా వుంటారు. చాలామంది ఎందుకొచ్చిన రచ్చ అంటూ వాటి జోలికి వెళ్లరు. ఐతే బాహుబలి చిత్రం సక్సెస్ కావడంతో ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. 
 
రానా ట్విట్టర్లో చాలా యాక్టివ్. ఏదైనా షేర్ చేస్తుంటాడు. ఈమధ్య రానాకు తన అభిమానులు ఓ ప్రశ్నను సంధించారు. మీరు ట్విట్టర్లో చాలా యాక్టివు కదా... మరి మీ స్నేహితుడు ప్రభాస్ ను కూడా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయమని చెప్పవచ్చు కదా అని ప్రశ్నించారు. 
 
దీనిపై రానా స్పందిస్తూ... ఈ విషయంలో చాలా ప్రయత్నించాను. ట్విట్టర్ ఖాతా తెరవమని చెప్పాను. కానీ ప్రభాస్ ఓపెన్ చేయడంలేదు. మీకు తెలుసు కదా... ప్రభాస్ చెపుతుంటాడు.. తను చాలా బద్ధకస్తుడునని. ఈ బద్ధకమే ట్విట్టర్ వైపు ప్రభాస్ రాకుండా చేస్తుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ప్రభాస్ చాలా సిగ్గరి. తెగ సిగ్గుపడుతుంటాడు. స్టేజి పైన కూడా ఎక్కువగా మాట్లాడడు.