మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 29 మార్చి 2025 (15:00 IST)

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

Vijaydevarakonda, Modi and others
Vijaydevarakonda, Modi and others
కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. టీవీ9 ఢిల్లీలో నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు విజయ్ దేవరకొండ.
 
Vijay Deverakonda
Vijay Deverakonda
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. స్టార్ గా ఎదిగిన తర్వాత నాలో కలిగిన ఫీలింగ్ ఒక రిలీఫ్ లాంటిది. మనం సాధించాల్సింది సాధించిన తర్వాత దక్కే సంతృప్తి అది. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం K డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్ ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. 
 
ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు. ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్" టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు.