Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్ లో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శ్రీలంక షూట్ లో వున్నారు. కింగ్ డమ్ సినిమా కోసం ఆయన అక్కడ పాల్గొన్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు ట్రెండీ లుక్ లో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. వాట్ ఇండియా థింక్స్ టుడే శుక్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది. టీవీ 9 ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ హాజరై అందరినీ సర్ ప్రైజ్ చేశారు.
నటుడిగా కెరీర్ ఉన్నతస్థితిలో వున్న విజయ్ దేవరకొండ కు ఇటువంటి గౌరప్రదమైన ఈవెంట్ రావడం అభిమానులను సంతోషపరిచింది. ఇక నటుడిగా ప్రస్తుతం ప్రధాని మోడీ ఈవెంట్ కు రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇటువంటి అవకాశం ఇప్పటివరకు తెలుగు హీరోలకు దక్కని అవకాశంగా నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా కింగ్ డమ్ సినిమాలో దేవరకొండ నటిస్లున్నారు. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైన ట్రెండ్ క్రియేట్ చేసింది.