రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్
అన్ని పనులు పూర్తి చేసుకుని, ప్రతిచోటా సూపర్ బ్లాక్ బస్టర్ బుకింగ్స్ తో మ్యాడ్నెస్ కి అదనపు వేడిని జోడిస్తున్నామంటూ మ్యాడ్ స్వ్కేర్ టీమ్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ప్రత్యేకం ఏమంటే, రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ప్రత్యేక ఆక్షణగా నిలవనుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ "కింగ్ డమ్" సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్ళారు.
అక్కడ ఓ లవ్ సాంగ్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. లవ్ సాంగ్స్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. "కింగ్ డమ్" లవ్ సాంగ్స్ కు కూడా ఆయన బ్లాక్ బస్టర్ ట్యూన్స్ రెడీ చేశారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన "కింగ్ డమ్" టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. "కింగ్ డమ్" సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.