స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ సెన్స్ అదుర్స్.. పుష్పరాజ్ లుక్ భలే!
స్టైలిష్ స్టార్‌గా పేరుగాంచిన అల్లు అర్జున్ తాజాగా ముంబైలోని ఎయిర్‌పోర్ట్‌లో మెరిశాడు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ అదిరింది. పుష్ప నటుడు ఎల్లప్పుడూ ట్రెండ్‌సెట్టర్‌గా ఉంటాడు. తన కిల్లర్ లుక్‌లతో ఫ్యాషన్‌కు పెద్ద పీట వేస్తాడు.
ఇలా తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో మెరిసిన అల్లు అర్జున్ తెల్లటి ప్యాంటుతో జత చేసిన ప్రింటెడ్ షర్ట్‌తో కూడిన తన ఉబెర్-కూల్ ఎన్‌సెంబ్ల్‌తో కనిపించాడు. అల్లు అర్జున్ తను ధరించే ప్రతి దుస్తులకు తన సిగ్నేచర్ స్టైల్ వుంటుంది.
అతని ఫ్యాషన్ సెన్స్ అతని పాత్రలకే పరిమితం కాకుండా అతని వ్యక్తిగత జీవితానికి కూడా విస్తరించింది. సాధారణ వస్త్రధారణను కూడా కూల్‌గా, స్టైలిష్‌గా మార్చగలడనడానికి అతని ఎయిర్‌పోర్ట్ లుక్ నిదర్శనమని ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.