బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (13:00 IST)

''ఇది నా లవ్‌స్టోరీ''తో ముందుకు వస్తోన్న తరుణ్.. టీజర్‌కు యూట్యూబ్‌లో 10లక్షల వ్యూస్

''నువ్వే-కావాలి'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో లవర్ బాయ్‌గా పేరు కొట్టేసిన తరుణ్ ప్రస్తుతం 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ ఓ డ్రీమ్ ప్రాజెక్టుతో ప్రేక

''నువ్వే-కావాలి'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో లవర్ బాయ్‌గా పేరు కొట్టేసిన తరుణ్ ప్రస్తుతం 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ ఓ డ్రీమ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ''ఇది నా ల‌వ్ స్టోరి'' అనే టైటిల్‌ని, ఫ‌స్ట్‌లుక్‌ని ఇటీవ‌ల రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌లో త‌రుణ్ లుక్ కొత్త‌గా ఉంది. గుబురు గ‌డ్డంతో ప్రేమికుల త‌త్వం తెలియ‌జేసే తాత్వికుడిలాగా ఇంట్రెస్టింగ్‌గా క‌నిపించాడు. 
 
సేమ్ టైమ్ మూడు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. మ‌రోసారి చాక్లెట్‌బోయ్ లుక్‌లో రీఫ్రెషింగ్‌గా, కొత్త‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. కామ‌న్ ఆడియెన్‌తో పాటు, ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు త‌రుణ్ లుక్ బావుందంటూ ప్ర‌శంసించారు. 
 
తాజాగా ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 10లక్షల వ్యూస్ సాధించింది. ఈ సంద‌ర్భంగా త‌రుణ్ త‌న అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలిపారు. తరుణ్ స‌ర‌స‌న ఈ చిత్రంలో ఓవియ హెలెన్ న‌టించారు. రమేష్ గోపి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ వి ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనాథ్ విజయ్ స్వరాలు అందించారు.