ఉప్పు బస్తాలు లేకపోతే కాలో, చేయ్యో విరిగేదిః సంపూర్ణేష్ బాబు
`పాత సినిమాలు రంగూన్ రౌడీ, టూ టౌన్ రౌడీ, స్టేట్ రౌడీ అప్పట్లో ట్రెండింగ్ సినిమాలు. ఆ టైటిల్స్ అంటే నాకు ఎంతో ఇష్టం .అయితే ఈ సినిమాకు "బజార్ రౌడీ" అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. పాత సినిమాలోని పాటలు ఫైట్స్ తో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేసేవారో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా అంతే ఎంజాయ్ చేస్తారని` `బజార్ రౌడీ` హీరో సంపూర్ణేష్ బాబు తెలియజేస్తున్నారు.
మహేశ్వరి, లోరాని నాయికలుగా నటించిన ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్సకత్వం వహించారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమా ఈనెల20న దాదాపు 300 థియేటర్స్ లలో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు పలు విషయాలు తెలియజేశారు.
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది .ఎందుకంటే ఇందులో నేను సీనియర్ ఆర్టిస్ట్స్ షిండే, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జయలలితల , దివంగత కత్తి మహేష్ లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
- ఈ సినిమా షూటింగ్ లో గాయపడిన మాట వాస్తవమే. కానీ నాకింద ఉప్పు బస్తాలు ఉన్నందున నాకు స్వల్ప గాయాలు ఆయ్యాయి. ఉప్పు బస్తాలు లేకపోతే కాలో, చేయ్యో ఫ్యాక్చర్ అయ్యేది. నిర్మాత వెంటనే సినిమా షూట్ అపేద్దామని చెప్పాడు. అయితే నేను పెద్ద ఆర్టిస్ట్స్ తో పని చేస్తున్నందున నాకు ఆ నొప్పి తెలియలేదు.వెంటనే షూట్ లో పాల్గొన్నాను.
ఈ చిత్ర దర్శకుడు నాగేశ్వరరావు కో-డైరెక్టర్ గా చాలా సినిమాలు చేశాడు. తను నాకు కథ చెప్పినప్పుడు నా సినిమాకు ప్రేక్షకులు కామెడీ ఉంటుందని వస్తారు. కానీ సినిమాను పీక్ కు తీసుకెళ్తున్నవని అన్నాను. కానీ తను ఇందులో కామెడీ ఎక్కడ మిస్ కాకుండా వుంటుందని భరోసా ఇస్తూ ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరని ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
- ఈ సినిమా సెకండ్ కరోనా రాకముందే రావాల్సింది. కరోనా కారణంగా సినిమా విడుదల జరగలేదు. పెద్ద, పెద్ద సినిమాలు కూడా ఓ.టి.టి. లలో విడుదల అవుతున్నందున మా సినిమాకు ఓ.టి.టి నుండి ఆఫర్స్ వచ్చాయి. కానీ మా నిర్మాత సినిమా ఎంత లెట్ అయినా థియేటర్ లోనే విడుదల చేయాలని విడుదల చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
- కథ విషయానికి వస్తే, చిన్నప్పడు ఇంటినుండి పారిపోయిన నేను ఒక బజార్ రౌడీ గా పెరుగుతాను. సెకండ్ హాఫ్ లో తప్పిపోయిన కొడుకు ఇతనే అని నన్ను కొంతమంది మా ఇంట్లో వదిలిపెడతారు. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లేదు కానీ డబల్ సేడు ఉంటుంది .కొబ్బరి మట్ట లో పెదరాయుడు గెటప్ తో బాగా పాపులర్ అయినందున ఈ సినిమాలో అన్నగారి "బొబ్బిలి పులి" సినిమా లోని గెటప్ వేయడం జరిగింది.
- సాయి కార్తీక్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. డాన్స్ పరంగా ప్రేమ్ రక్షిత్, నిక్సన్, స్వర్ణ మాస్టర్స్ దగ్గర డ్యాన్డ్ ప్రాక్టీస్ చేసి ఇందులోని పాటలకు డాన్స్ చేశా. పెద్ద సినిమాలకు వచ్చిన ఆప్లాజ్ ఈ సినిమాకు వస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇదే నాకు పెద్ద సినిమా అవుతుంది
- ఈ సినిమా తర్వాత నేను ఐదు సినిమాలు చేస్తున్నాను. కాలీఫ్లవర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సోదరా- అనే సినిమా కూడా అయిపోయింది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాను. యన్.ఆర్ రెడ్డి దర్శకత్వంలో `దగడ్ సాంబ` సినిమా 70% షూట్ అయ్యింది. తర్వాత ఐదు క్యారెక్టర్స్ వుండే ఒక సినిమా చేస్తున్నాను రెండు సాంగులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి .పుడింగి నెంబర్ వన్ 30% షూట్ అయింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలను ఆదరించనట్లే ఈ నెల 20 న వస్తున్న మా "బజార్ రౌడీ" చిత్రాన్ని కూడా ఆదరించాలని ప్రేక్షకు దేవుళ్ళను మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.