సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 జులై 2024 (16:47 IST)

అబుదాబిలోని యాస్‌ ద్వీపంలో స్టార్స్ మధ్య జరగనున్న ఐఐఎఫ్‌ఏ ఉత్సవం

Rana Daggubati,   Devisree, kushboo,  Teja Sajja, Raashi Khanna  and others
Rana Daggubati, Devisree, kushboo, Teja Sajja, Raashi Khanna and others
సౌత్‌ ఇండియన్‌ సినిమా సాధించిన విజయోత్సవ సంబరాలను  చేసుకుంటూ, దక్షిణాది గొప్పతనాన్ని హైలైట్‌ చేస్తూ తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలు సంయుక్తంగా ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024ను యూఏఈ –అబుదాబిలోని యాస్‌ ద్వీపంలో సెప్టెంబర్‌లో అంగరంగవైభవంగా జరపనుంది.

యూఏఈ టోలరెన్స్‌ అండ్‌ ఎగ్జిస్టెన్స్‌ మంత్రి షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ ఏఐ నహ్యాన్‌ సమక్షంలో, అబుదాబి మరియు మిరల్‌ల డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ టూరిజంతో భాగస్వామ్యంతో సౌత్‌ ఇండియన్‌ సినిమా సగర్వంగా తన ప్రశస్తిని చాటుకోనుంది. ఐఐఎఫ్‌ఏ ఉత్సవం యొక్క అంతర్జాతీయ వేడుకలు అత్యంత వైభవంగాæ అధికారిక భారతదేశంతో ప్రారంభమైనందున దాని అంచనాలు మరింత అపూర్వమైన స్థాయికి పెరిగాయి. 
 
ఇందులో భాగంగా  మంగళవారం హైదరాబాద్‌లో ఐఐఎఫ్‌ఏ ఉత్సవం సంబంధించిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ భారత సినిమా విజయాలు మరియు గౌరవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న రెండు రోజుల వేడుకకు తమిళం, తెలుగు, మలయాళం, మరియు కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ సినీ ప్రముఖులతో ఉత్కంఠతో సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యాంతం ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో హోస్ట్‌లు, సదరన్‌ సినిమా పయనీర్స్, ఇండస్ట్రీ లీడర్‌లు, అంతర్జాతీయంగా ఆర్టిస్టులు, జాతీయ–అంతర్జాతీయ ప్రముఖులు, ముఖ్య మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. స్టార్స్‌ రానా దగ్గుబాటి, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్, తేజ సజ్జా, రాశి ఖన్నా, శ్రీలీల, విజయ్‌ రాఘవేంద్ర, పెర్లే మానే, ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ రామన్న, ఆరాధనా రామ్, సుదేవ్‌ నాయర్, సిమ్రాన్‌ రిషి బగ్గా, రసూల్‌ పూకుట్టి, కుష్బూ, సాగర్‌ (ప్లయ్‌బ్యాక్‌ సింగర్‌ తెలుగు సినిమాలు), మంగ్లీ (ప్లేబ్యాక్‌ సింగర్‌ తెలుగు సినిమా), నితిన్, అక్షర హాసన్, తేజ ధర్మ, డి. సురేష్‌ బాబు, కె. ఎస్‌. రామారావు, అల్లు అరవింద్, శరత్‌ మరార్, సతీష్, నవదీప్‌ తదితర దక్షిణ భారత సినీ ప్రముఖుల ఈ ప్రెస్‌మీట్‌లో హాజరయ్యారు.
 
–భారతీయ సినిమా సూపర్‌స్టార్, మెగాస్టార్‌ చిరంజీవికి ఐఐఎఫ్‌ఏ ఉత్సవం ‘ఔట్ట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’గా ప్రత్యేక గౌరవాన్ని అందించింది..
–ప్రముఖ నటి సమంతా రూత్‌ ప్రభును భారతీయ సినిమాలో ప్రతిష్టాత్మక ’ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో సత్కరించబడుతోంది..
–‘ఐకాన్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ ఐఐఎఫ్‌ఏ ఉత్సవం 2024కి హాజరరుకానున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు వేడుక జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అల్లు అర్జున్‌ తదుసరి ప్రతిష్టాత్మక సీక్వెల్‌ పుష్ప–2 అప్‌డేట్స్‌ కోçసం ఆత్రంగా ఎదురు చూప్తున్నారు. 
–తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకతగాంచిన  సూపర్‌ స్టార్‌ తండ్రీ కొడుకుల ద్వయం నాగార్జున అక్కినేని–అఖిల్‌ అక్కినేని ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు.
–అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్‌ స్పెక్టాకిల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కేడీ–కాళిదాసు స్పెషల్‌ ట్రైలర్‌ను ఈ గ్లోబల్‌ వేదికపై ఆవిష్కరించనున్నారు.
–ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాతలు కే.ఎస్‌. రామారావు, డీ.సురేష్‌ బాబు, నవీన్‌ యెర్నేని వంటి ప్రముఖులు పాల్గొననున్నారు..
 
–ఫిల్మ్‌స్టార్స్‌...రానా దగ్గుబాటి, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్, తేజ సజ్జా, రాశి ఖన్నా, శ్రీలీల, విజయ్‌ రాఘవేంద్ర, పెర్లే మానే, ప్రగ్యా జైస్వాల్, మాలాశ్రీ రామన్న, ఆరాధనా రామ్, సుదేవ్‌ నాయర్, సిమ్రాన్‌ రిషి బగ్గా, రసూల్‌ పూకుట్టి, కుష్బూ, సాగర్‌ (ప్లయ్‌బ్యాక్‌ సింగర్‌ తెలుగు సినిమాలు), మంగ్లీ (ప్లేబ్యాక్‌ సింగర్‌ తెలుగు సినిమా), నితిన్, అక్షర హాసన్, తేజ ధర్మ, డి. సురేష్‌ బాబు, కె. ఎస్‌. రామారావు, అల్లు అరవింద్, శరత్‌ మరార్, సతీష్, నవదీప్‌ తదితర దక్షిణ భారత సినీ ప్రముఖులు రానున్నారు.