రజినీకాంత్ తాజా సినిమా వెట్టయన్ లేటెస్ట్ అప్ డేట్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా తమిళ వెట్టయన్. దీనిని తెలుగులో కూడా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టి.జె. జ్నానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమాలో మంజువారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, జికెఎమ్ తమిళకుమారన్ తదితరులు నటిస్తున్నారు.
నేడు ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రజనీకాంత్ తన పోర్షన్ వెట్టయన్ చిత్రీకరణను పూర్తి చేసారని పేర్కొంది. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీయనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఈ అక్టోబర్ లో థియేటర్లలో రానుంది.