మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (19:16 IST)

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన Mr బచ్చన్ టీం

Harish shankar
Harish shankar
మాస్ మహారాజా రవితేజ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్ గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ముగించుకుంది. కీలక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగిఉన్న వీడియోను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.
 
హరీష్ శంకర్ ఎప్పటిలాగే శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్లైన్. అయనంక బోస్ సినిమాటోగ్రఫీని, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
 
మిగిలిన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.
 తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు