సినిమారంగంలో శ్రీరామచంద్రుడు బయట నిందలుపడ్డాడు
సినిమారంగంలో అందరికీ కావాల్సినవాడు ఎవరంటే మురళీమోహన్ అని చెబుతారు. తను చాలా నిక్కచ్చి. ఎవరినీ విమర్శించేవాడు కాదు. ఆయన అసలు పేరు రాజాబాబు. సినిమాలోకి వచ్చాక పేరు మారింది. ఆయన
జన్మదినం జూన్ 24. సినిమా నటుడిగానే వుంటూ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎం.పి.గానూ గెలిచారు. ఇక అలాంటి మురళీమోహన్‌ను పలుసార్లు శ్రీరామచంద్రుడు అంటూ అక్కినేని నాగేశ్వరరావు అనేవారట. ఇక్కడ సినిమా ఫంక్షన్లో అంటే సరి, విదేశాల్లో కూడా జరిగే వేడుకల్లో అక్కినేని ఇదే విషయం చెప్పేవారట. తన కట్టుబాట్లతో శ్రీరాముడు చంద్రుడిలా వుంటాడనీ, ఇలా ఈ రంగంలో వుండడం చాలా అరుదైన విషయమని అక్కినేని అనేవారు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక ఇదిలా వుంటే, సినిమారంగలో సంపాదించి ఇక్కడే కోల్పోయారు కూడా. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ సంపాదించింది కూడా ఆ రంగంలోనూ కోల్పోయారు. అదెలాగంటే, మురళీమోఃహన్‌కు పంపిణీ వ్యవస్థ వుంది. సినిమాలు కొనేవారు. మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కొనాలని మూడు సినిమాలుకు ప్రయత్నించినా పోటీ వల్ల సాధ్యపడలేదు. ఆఖరికి ఎం.జి.ఆర్., కరుణానిధి కథతో `ఇరువురు` అనే సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో ఇద్దరుగా విడుదల చేశారు. ఆ సినిమాను భారీ రేటుతోనే మురళీమోహన్ కొనుగోలు చేశారు. ఇక సినిమా మార్నింగ్ షోకూ అది ఢమాల్ అయింది. దాంతో పెట్టిందంతా పోయింది. ఈ విషయం తెలిసిన ఆ చిత్ర నిర్మాణ సంస్థ 25 శాతం వాపసు ఇచ్చింది. ఆ తర్వాత అప్పటికే పార్టనర్ షిప్‌గా కొన్ని సినిమాలు విడుదల చేశాక అక్కడా దెబ్బపడింది.
అందుకే ఆయన ముందుచూపుగా శోభన్‌బాబు సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. వచ్చాక ఆయనకు బాగానే కలిసివచ్చింది. ఓసారి ఎవరినో ఇన్‌కంటాక్స్ వారు రైడింగ్ చేయాల్సి వచ్చి రిఫరెన్స్‌గా మురళీమోహన్ ఇంటికి వచ్చారు. వచ్చారు కదా. ఆయన ఇల్లు సోదా చేశారు. ఎక్కడా ఎటువంటి తప్పులు కనిపించలేదు. ఆఖరికి వట్టి చేతులతో వెళ్టడం ఇష్టం లేదని ఆ వచ్చిన అధికారులు కోటి రూపాయలు బ్లాక్‌మనీగా వున్నట్లు రాసి సంతకం పెట్టమని అడిగారు. దానికి ఆయన ససేమిరా అన్నాడు. ఏదో కాజువల్ కోసం మీకు ఎటువంటి ఇబ్బంది వుండదని అధికారులు హితవు పలికారు. చివరికి అది కోర్టువరకు వెళ్లి. ప్రాణం పోయినా నేను చేయని తప్పుకు తలవంచని ఖరాఖండిగా తెలిపేశారు మురళీమోహన్. దాంతో అధికారులు దాన్ని ట్రిబునల్ వరకు తీసుకెళ్ళారు. అక్కడ కేసును కొట్టేశారు. దాంతో ఆయనపై పడ్డ నింద కాస్త వీడిపోయింది. ఇలా అధికారులు అమాయకులను మంచిగా మాటల్తో మాయచేసి ఇరికిస్తారనేందుకు మురళీమోహన్ ఉదంతమే ఓ చక్కటి ఉదాహరణ.