బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (17:34 IST)

బుర్రిపాలంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, దేవుడిలాంటి మనిషీ పుస్తక ఆవిష్కరణ

adiseharirao, vinayakarao and others
adiseharirao, vinayakarao and others
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, దేవుడిలంటి మనిషీ పుస్తక ఆవిష్కరణ, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం బుర్రిపాలంలో జరిగింది. ఆ గ్రామ ప్రజల ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. హీరో సుదీర్ బాబు, కృష్ణ గారి కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, జయ, రమేశ్ బాబు భార్య మృదుల, నన్నపనేని రాజకుమారి, నిర్మాతలు అచ్చిరెడ్డి, శాఖమూరి మల్లికార్జునరావు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన దేవుడి లాంటి మనిషి పుస్తకాన్ని సుధీర్ బాబు ఆవిష్కరించి ఆదిశేషగిరిరావు కు తొలి కాపీ అందించారు.
 
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ కృష్ణ గారిలా నేను కూడా సినిమాను ఇష్టపడి, కష్టపడి  ఈ రంగంలోకి వచ్చి మి అందరి అభిమానాన్ని పొందాను. బుర్రిపాలంలో జరిగిన కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వినాయకరావు గారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం నా చేతుల మీదుగా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
 
దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కృష్ణగారు ఎప్పటికీ నంబర్ వన్. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వినాయకరావు గారు పుస్తకం రాయడం అభినందనీయం అన్నారు. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ. కృష్ణగారు నిర్మాతల హీరో. ఆయన నిజంగానే దేవుడి లాంటి మనిషి. ఆ విషయాన్ని ఈ పుస్తకం లో వినాయకరావు గారు చక్కగా ఆవిష్కరించారు అన్నారు
నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ  బు ర్రి పాలం గ్రామంలో అన్నయ్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. అలాగే సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు మూడేళ్ల పాటు శ్రమించి అద్భుతమైన సమాచారం తో దేవుడి లాంటి మనిషి పుస్తకం రాశారు. చరిత్రకు అద్దం పట్టే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. అన్నారు.
 
చివరిగా పుస్తక రచయిత వినాయకరావు మాట్లాడుతూ కృష్ణగారీ కోరిక మీదే ఈ పుస్తకాన్ని అదనపు హంగులతో రెండో సారి తీసుకు వచ్చాను. అయితే ఈ పుస్తకాన్ని చూడకుండానే ఆయన ఆయన మనకు దూరం కావడం విచార కరం. కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా  ఈ పుస్తకం విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉంది..అన్నారు.