1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (12:29 IST)

విశ్వనాథ్‌ గారి భార్య జయలక్ష్మిని పరామర్శించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్

chiru - viswanadth wife paramarsa
chiru - viswanadth wife paramarsa
ఈరోజు మృతి చెందిన దర్శకుడు కె. విశ్వనాథ్‌ గారిని సినీ రంగ ప్రముఖులు నివాళులు అర్పించారు. విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి. వారికి  ముగ్గురు పిల్లలు, పద్మావతి దేవి, నాగేంద్రనాథ్, రవినాద్రనాథ్. గత కొంతకాలంగా విశ్వనాథ్‌ గారు అనారోగ్యముతో బాధపడుతున్నారు. అలాగే విశ్వనాథ్‌ గారి భార్య  జయలక్ష్మి గారు కూడా అనారోగ్యముతో బాధ పడుతున్నారు. ఆమె మంచానికే పరిమితం అయ్యారు. ఈరోజు విశ్వనాథ్‌ గారి ఇంటికి వెళ్లిన  చిరంజీవి, పవన్ కళ్యాణ్  ఆమెను పరామర్శించి ఓదార్చారు. 
 
విశ్వనాథ్‌ గారి  పూర్వీకులది  పెదపులివర్రు, ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం నుండి వచ్చారు.  తన తండ్రి అసోసియేట్‌గా ఉన్న మద్రాసులోని వాహిని  స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా విశ్వనాథ్‌  వృత్తిని ప్రారంభించాడు. అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేసారు. ఆయనలో చురుకుదనం చూసి అక్కినేని గారు అన్నపూర్ణ కు ఆహ్వానం  పలికారు. ఆ తర్వాత ఎన్. టి.ఆర్. తోను మూడు సినీమాలు చేసారు.