శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (14:44 IST)

బ్రాహ్మణ యువకుడిగా మారిపోయిన అల్లు అర్జున్.. ప్రత్యేక క్లాసులు కూడా...

టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా మారిపోయారు. దీంతో ఫిల్మ్ నగర్ సైతం నివ్వెర పోయింది. అయితే, ఆయన నిజంగా బ్రాహ్మణ యువకుడిగా మారిపోలేదు.

టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా మారిపోయారు. దీంతో ఫిల్మ్ నగర్ సైతం నివ్వెర పోయింది. అయితే, ఆయన నిజంగా బ్రాహ్మణ యువకుడిగా మారిపోలేదు. కేవలం తన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం" చిత్రం కోసమే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 
 
ఇందులో ఓ పాత్రలో బ్రహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్రని ఛాలెంజ్‌గా తీసుకొన్న బన్నీ.. బ్రహ్మణ యువకుడిగా ఒదిగిపోయేందుకు ముందస్తు కసరత్తు చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంటున్నారు. అయితే, ఈ శిక్షణ క్లాసులు ఇంకా కొనసాగుతున్నాయట.
 
బ్రహ్మణ పాత్ర కోసం ఒకరిద్దరు బ్రహ్మణులని ప్రత్యేక నియమించుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. తన మాటయాసల్లో, వేషధారణలో ఫర్ఫెక్షన్ కోసం క్లాసులుని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడట. ఇవి పూర్తయిన తర్వాత బన్నీ తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది వేసవిలో విడుదల చేసేలా నిర్మాత ప్లాన్ చేశారు.