బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (13:38 IST)

విడాకులు తీసుకున్నాక.. మోడ్రన్‌గా ఉండకూడదా? విజయ్‌పై కోపం లేదు: అమలా పాల్

హీరోయిన్ అమలాపాల్ గురించి అందరికీ తెలిసిందే. భర్త కంటే కెరీర్ ముఖ్యం అనుకుని అతని నుంచి దూరమైన ఈ ముద్దుగుమ్మ విడాకులు కూడా తీసుకుంది. మాలీవుడ్‌ దీపికా పదుకొనెగా పిలిపించుకునే అమలాపాల్‌ ప్రస్తుతం సెక్

హీరోయిన్ అమలాపాల్ గురించి అందరికీ తెలిసిందే. భర్త కంటే కెరీర్ ముఖ్యం అనుకుని అతని నుంచి దూరమైన ఈ ముద్దుగుమ్మ విడాకులు కూడా తీసుకుంది.  మాలీవుడ్‌ దీపికా పదుకొనెగా పిలిపించుకునే అమలాపాల్‌ ప్రస్తుతం సెక్సీ డ్రెస్సులతో అదరగొట్టేస్తుంది. కొన్నినెలల క్రితం భర్తను గాఢంగా ప్రేమించాను. ప్రస్తుతం సినిమాను అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. 
 
పెళ్ళి కలకాలం కలిసుండేందుకే చేసుకుంటారు. విడాకులు కోరుకోరు. కానీ తన జీవితంలో అంతా ఓ కలలా జరిగిపోయింది. విడిపోతేనే మంచిదనుకుని విడిపోయాం. అసలు విజయ్‌పై తనకు కోపం లేదు. ఇప్పటికీ అతనంటే అభిమానమేనని.. వ్యక్తిగా ఇష్టపడతానని అమలా పాల్ వెల్లడించింది. విజయ్‌‍తో విడాకులకు తన సోదరుడు అండగా నిలిచాడని.. ఒత్తిడి, దుఃఖాన్ని అధిగమించానని తెలిపాడు. పెళ్ళయ్యాక పరిధులు ఉండేవి.. ఇప్పుడవి లేవు. స్వేచ్ఛగా విహరించే పక్షిలా ఫీల్ అవుతున్నానని ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పుకొచ్చింది. 
 
విడాకులు తీసుకున్నాక తన డ్రెస్‌లపై విమర్శలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్నాక మోడ్రన్‌గా ఉండకూడదా? తన బాడీకి సరిపోయే డ్రెస్‌లు వేసుకుంటాను. దానిపై విమర్శలు అవసరమా అంటూ ప్రశ్నించింది.