శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (13:06 IST)

బిగ్ బాస్ 4 వాయిదా నిజమేనా..?

బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాల్టీ షో అంటే అందరూ చెప్పే పేరు బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు మూడు సీజన్లు పూర్తవ్వడం... ఈ మూడు సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. నాలుగో సీజన్‌కు స్టార్ మా టీవీ రెడీ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారు. ఇటీవల టీజర్ షూట్‌ను నాగార్జున కంప్లీట్ చేసారు.
 
త్వరలో టీజర్ రిలీజ్ కానుంది అనుకుంటున్న టైమ్‌లో బిగ్ బాస్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ... కారణం ఏంటంటే... బిగ్ బాస్ సెట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట.
 
 మరో కారణం ఏంటంటే... 14 రోజుల హోం క్వారెంటైన్‌లో ఉంచాల‌న్న నిబంధ‌న ఉంది. హోం క్వారెంటైన్లో ఉన్న త‌ర‌వాత కొవిడ్ ప‌రీక్ష‌ల్ని మ‌ళ్లీ నిర్వ‌హిస్తారు. ఆ ప‌రీక్ష‌ల్లో నెగిటీవ్ వ‌చ్చిన త‌ర‌వాతే.. షో ప్రారంభం కాబోతోంది.
 
ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది. అందుచేత ఈ షోను ముందుగా అనుకున్నట్టుగా ఆగష్టులో కాకుండా సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు అంటూ కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఇప్పటివరకు అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. బిగ్ బాస్ వాయిదా అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.