నా గత మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని చూడలేదు: రామ్ గోపాల్ వర్మ

varma
Selvi| Last Updated: శుక్రవారం, 6 మే 2016 (15:19 IST)
బాలకృష్ణతో లెజండ్, లయన్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే.. ప్రస్తుతం కబాలి చిత్రంలో నటిస్తుంది. తెలుగు సినిమాల్లో నటించనని స్టేట్మెంట్ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా.. గ్లామర్ డోస్ ఎక్కువైనా ఏమాత్రం మొహమాటం లేకుంటే నటించే రాధికా ఆప్టే.. ఓ ఇంగ్లీష్ పత్రిక కోసం ఫోటోషూట్ చేసి హీటెక్కించింది.

లోదుస్తులు ధరించకుండా ఎద అందాలను కప్పీకప్పనట్లుగా వేసుకున్న చొక్కా తప్ప ఒంటిపై ఏమీ వేసుకోకుండా అలానే ఫోజిచ్చిన రాధికా ఆప్టే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ సృష్టిస్తోంది.

రాధికా ఆప్టే ఇలా హాటుగా ఫోజివ్వడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించాడు. ‘కబాలి’ కథానాయిక రాధికా ఆప్టేను అలా హాట్ హాట్‌గా చూసిన వెంటనే వర్మ మతి పోయింది. అంతే ఆ అమ్మడు ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి తన గత మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.దీనిపై మరింత చదవండి :