ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్.. బ్యాచిలర్ లైఫ్‌కు 'సాహో' భామ స్వస్తి
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్. టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌తో "సాహో" చిత్రంలో నటిస్తోంది. రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పైగా, రెండేళ్లుగా ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధా కపూర్ ఓ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తోంది. ఇపుడు అతన్నే పెళ్లి చేసుకోనుంది. ఇతకీ ఆ ఫోటోగ్రాఫర్ పేరు రోహన్ శ్రేష్ట. సినీ ప్రముఖులకు ఫోటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుంటారు.
ఈయనతో గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న శ్రద్ధా కపూర్... 2020లో శ్రద్ధ అతన్ని వివాహం చేసుకుని స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రోహన్ ఇప్పటికే తన ఇంట్లో వారికి చెప్పి పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020లో శ్రద్ధా, రోహన్ పెళ్లి పీటలెక్కుతారు.