మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (18:36 IST)

ఆ బ్యాటుతో శ్రద్ధా వళ్లు హూనం? సైనా బయోపిక్ నుండి శ్రద్ధా కపూర్ ఔట్...

టాలీవుడ్, బాలీవుడ్ అన్నిచోట్లా బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. ఎంతో ఆసక్తి నెలకొన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో కొత్త మలుపు చోటుచేసుకుంది. అమోల్ గుప్తే డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌ను సైనా పాత్రకు ఎంపిక చేసారు. ఇందుకోసం ఆమె బ్యాడ్మింటన్ శిక్షణ కూడా తీసుకున్నారు. వర్క్‌షాప్‌లు, శిక్షణ అంటూ హడావిడి అయ్యాక ఈ తరుణంలో బయోపిక్ నుండి ఆమె తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
 
మీడియా కథనం ప్రకారం షూటింగ్ లేటుగా మొదలు కానుండటంతో వేరే సినిమాల డేట్స్‌తో క్లాష్ ఏర్పడినట్లు, అందువలనే శ్రద్ధా కపూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్లు, నిర్మాతలు మరియు శ్రద్ధా కపూర్ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఐతే పొద్దస్తమానం బ్యాడ్మింటన్ బ్యాటు తీసుకుని ప్రాక్టీసు చేయాలని అంటుండంతో శ్రద్ధా వళ్లు హూనం అవుతోందట. దీని కారణంగా బుగ్గలు లోపలికి పీక్కుపోయి అంటు దవడల్లా మారిపోతున్నాయట. అందుకే ఆమె తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. 
 
ఐతే ఈ సినిమా నిర్మాత భూషణ్ మాట్లాడుతూ శ్రద్ధా కపూర్ తప్పుకోవడం అనేది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని, ఆ స్థానంలో పరిణీతి చోప్రాను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో షూటింగ్ ముగించి, 2020లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ కూడా 2020లోనే ఉండటంతో ఆ సమయంలో రిలీజ్ చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.