శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:33 IST)

హీరోతో డేటింగ్... హీరోయిన్‌కు సవతి తల్లి మదలింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్ సినీ కెరీర్ మొదలై ఏడాది కూడా ఇంకా పూర్తి కాలేదు, కానీ ఆమె ఎఫైర్లపై వస్తున్న రూమర్లు ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో హీరో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ధోని సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇటీవల హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా సారా ప్రత్యేకంగా డెహ్రాడూన్ నుండి వచ్చి, అర్ధరాత్రి కేక్‌తో అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్లింది. కేక్ కటింగ్, డిన్నర్ తర్వాత సారాను స్వయంగా సుశాంత్ తీసుకొచ్చి అపార్ట్‌మెంట్ వద్ద వదిలి వెళ్తుండగా మీడియా కంట్లో చిక్కారు. 
 
ఇక వీరిద్దరి వ్యవహారం గురించి మీడియాలో పలువార్తలు ప్రసారం కాగా, సారా స్పందించి తమ మధ్యలో అలాంటిదేమీ లేదని స్పష్టం చేసారు. ఇక ఈ వార్త చెవిన పడగానే సైఫ్ దంపతులు అలర్ట్ అయ్యారు. కెరీర్ ప్రారంభం కావడంలో జాగ్రత్తగా ఉండాలని, కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలని ఈ నేపథ్యంలో కరీనా ఆమెను మందలించినట్లు, దానికి సారా పెద్దగా స్పందించనట్లు తెలిసింది.