శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (15:02 IST)

అలియా భట్ ప్రియుడంటే నాకు ఇష్టం.. అతన్ని పెళ్లాడాలనివుంది.. సారా అలీఖాన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్. బాలీవుడ్ నటిగా కొనసాగుతోంది. అయితే, ఈమెకు మరో బాలీవుడ్ నటి అలియా భట్ ప్రియుడు, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ కపూర్‌ను పెళ్ళి చేసుకోవాలని ఉందట. ఈ మాట విన్న సైఫ్ అలీఖాన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పైగా, రణ్‌వీర్ కుమార్ ఎవరో కాదు.. సారా అలీఖాన్ సవతి తల్లి, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్వయానా సోదరుడు కావడం గమనార్హం. 
 
టీవీ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్-6కు సంబంధించిన కొత్త ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. దీనిలో బాలీవుడ్ హీరో సైఫ్‌అలీఖాన్, అతని కుమార్తె సారా అలీఖాన్‌లు ఉన్నారు. తండ్రీకూతుర్లు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారని కావడం గమనార్హం. ఈ షోలో వీరిద్దరూ వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. 
 
ఇందులోభాగంగా సారా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బహిర్గతం చేసింది. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు సారా సమాధానం చెబుతూ తాను రణబీర్‌ కపూర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కాగా రణబీర్ కపూర్ ఆమె సవతి తల్లి కరీనా కపూర్‌కు సోదరుడు. ఈ కారణంగానే ఈ వార్త సంచలనంగా మారింది. ఈ మాట వినగానే షోలో ఉన్న ఆమె తండ్రి సైప్‌అలీఖాన్‌తో పాటు, హోస్ట్ కరణ్ జోహార్ తెగ ఆశ్చర్యపోయారు. ఇంతకీ రణ్‌వీర్ కపూర్ మరో నటి అలియా భట్ ప్రియుడు కావడం గమనార్హం.