సెక్స్ వర్కర్‌గా మారనున్న గూఢచారి హీరోయిన్ శోభిత
గూఢచారి హీరోయిన్.. శోభిత ధూళిపాళ్ల సెక్స్ వర్కర్‌గా మారనుంది. తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలను కైవసం చేసుకుంటున్న గూఢచారి హీరోయిన్.. శోభిత.. 2013 మిస్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటిక
గూఢచారి హీరోయిన్.. శోభిత ధూళిపాళ్ల సెక్స్ వర్కర్‌గా మారనుంది. తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలను కైవసం చేసుకుంటున్న గూఢచారి హీరోయిన్.. శోభిత.. 2013 మిస్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటికే అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 చిత్రంలోనూ, సైఫ్ అలీకాన్ కాలాకండి సినిమాలోనూ నటించింది. ఇక తెలుగులో గూఢచారి ద్వారా మంచి పేరు కొట్టేసింది.
అడవిశేష్‌తో కెమిస్ట్రీ అదిరిందని పాజిటివ్ టాక్ రావడంతో.. దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. తాజాగా శోభిత మలయాళ సినిమా కోసం సెక్స్ వర్కర్‌గా మారుతోంది. మూతాన్ అనే పేరిట జీతు మోహన్‌దాస్ తెరకెక్కించే సినిమాలో శోభిత సెక్స్ వర్కర్‌గా నటించనుంది. ఈ సినిమా ద్వారా శోభిత మంచి పేరు కొట్టేయడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు.