శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (14:57 IST)

ఆర్ఆర్ఆర్ పై ఆర్జీవీ కామెంట్స్.. రాజమౌళి భద్రతను పెంచుకోవాలి...

Ram Gopal Varma
"ఆర్ఆర్ఆర్"పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ఇటీవల ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసిన వర్మ.. ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఎవరూ ఊహించి వుండరని కితాబిచ్చాడు. 
 
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి సహా ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి క్షణాలను ఊహించి వుండరని ప్రశంసించాడు. 
 
అలాగే రాజమౌళి భద్రతను పెంచుకోవాలని కోరాడు. దేశంలోని కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారని.. అందులో తానూ ఒకడినని సరదాగా బెదిరించాడు. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టేస్తున్నానంటూ తన ట్వీట్ లో చమత్కరించాడు.