మంగళవారం, 27 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (15:50 IST)

అథర్వ నుంచి అరవింద్ కృష్ణ న్యూ లుక్

Arvind Krishna new look
Arvind Krishna new look
కార్తీక్ రాజు హీరోగా, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటించిన అథర్వ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను మహేష్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. విజయ, ఝాన్సీలు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
 
అథర్వ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్‌లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది.
 
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌లకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది.
 
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్ చేసేలా సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు.
 
ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేశారు. డీజే టిల్లు, మేజర్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. చరణ్‌ మాధవనేని కెమెరామెన్‌గా, ఎస్‌బి ఉద్దవ్ ఎడిటర్‌గా వ్యహరించారు.
 
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.