మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (21:35 IST)

ఆ సీన్లు అదిరిపోయానని చెప్పగానే సిగ్గు పడ్డా: ఇషా రెబ్బా

రాగల 24 గంటల్లో సినిమాతో మరో విజయాన్ని కైవసం చేసుకుంది నటి ఇషా రెబ్బా. కాస్త గ్యాప్ వచ్చిన తరువాత సినిమాలు చేసిన ఇషా రెబ్బకు ఈ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. హీరో సత్యదేవ్ కన్నా హీరోయిన్ ఇషా రెబ్బాకే ఈ సినిమాలు ఎక్కువ మార్కులు పడ్డాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా ప్రేక్షకుల నాడి పట్టింది. తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు శ్రీనివాసుల రెడ్డి తనతో కొన్ని సీన్లు చెప్పారని అప్పుడు ఆయన ఆ సీన్లు చెప్పేందుకు ఇబ్బందిపడ్డారని ఇషా రెబ్బ చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం తన భర్త, తనకు మధ్య జరిగిన రొమాన్స్ సీన్ల వల్లే ఉంటుందని.. కథ మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌కు దారితీస్తుందని.. ఆ సీన్లు ఖచ్చితంగా తీయాలని, ఆ సీన్లలో నటించడం ఏమీ అభ్యంతరం లేదు కదా అని అడిగారు. 
 
ఆ సీన్లు అంటే శోభనం సీన్లు.. దర్శకుడు అలా చెప్పడానికి కూడా మొహమాటపడ్డారు. కానీ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. శోభన సీన్లలో నా పర్మాన్సెన్స్ అదిరిపోయిందంటూ చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దర్సకుడు శ్రీనివాసులరెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని తెగ సంబరపడిపోతుంది ఇషారెబ్బా.