నేను చాలా హాట్ గురూ అంటున్న హీరోయిన్! (video)
ఈషా రెబ్బా.. తెలుగు వెండితెరపై మెరుస్తున్న యంగ్ హీరోయిన్లలో ఒకరు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత ఎక్స్‌పోజింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండే హీరోయిన్లలో మొదటివరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి ఈషా రెబ్బా... తొలిసారి మహిళా ప్రాధాన్య చిత్రం 'రాగల 24 గంటల్లో'. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు కథ చెప్పినప్పుడు తర్వాత ఏమవుతుందనేది నాలుగైదుసార్లు ఊహించా. నా ఊహ తప్పయింది. ప్రేక్షకులెవరూ కథలో మలుపులు ఊహించలేరు. శ్రీనివాసరెడ్డి అంత అద్భుతంగా తీశారు. ఇటువంటి కథలు హీరోయిన్లకు అరుదుగా లభిస్తాయన్నారు.
నేను చేసిన తొలి మహిళా ప్రాధాన్య చిత్రమిది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డాను. నా పాత్రలో కోపం, అసహనం, వినోదం... ఇలా చాలా భావోద్వేగాలున్నాయి. అందుకు మానసికంగా కష్టపడ్డా. కొన్ని సన్నివేశాల్లో వాదోపవాదాలు, కొట్టుకోవడం వంటివి ఉన్నాయి. అవి చేయడం శారీరకంగా కష్టమైంది. ఇందులో విద్యాగా కనిపిస్తా. కథంతా నా చుట్టూ తిరుగుతుందని చెప్పుకొచ్చింది.