సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (17:41 IST)

#HappyBirthdayViratKohli భూటాన్‌లో ఎంజాయ్ చేస్తున్న విరుష్క జోడీ (video)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంగళవారం నవంబర్ 5న పుట్టిన రోజు. దీంతో తన భార్య అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ భూటాన్‌కు విహారానికి వెళ్లాడు. భూటాన్‌లో బర్త్‌డే బాయ్ అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే ఫోటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చాయని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొంది. భూటాన్‌లోని సేంద్రియ కూరగాయాల మార్కెట్‌, దేవాలయాలు, ప్రకృతి అందాల మధ్య విరుష్క జోడీ విహరించింది. గత ఏడాది బర్త్‌డే రోజున విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో గడిపిన విషయం తెలిసిందే. ఆ రోజు కోహ్లీ బర్త్‌డే సందర్భంగా... 'కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు' అని అనుష్క ట్వీట్‌ చేసింది.
 
ఇకపోతే.. కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ 'వి' పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3.30 ప్రసారం చేస్తోంది. 15 ఏళ్ల వయస్సులో పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి టీమిండియా కెప్టెన్‌ అయ్యే వరకు కోహ్లీ ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్లలో వివరించారు. అలాగే చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ సంబంధాలను కూడా చూపించనున్నారు.
 
సూపర్‌ 'వి'లోని మొదటి ఎపిసోడ్‌ మంగళవారం టెలికాస్ట్‌ కానున్నా.. మిగిలిన 11 ఎపిసోడ్‌లు తదుపరి ఆదివారాలు ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతాయి.