సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (10:51 IST)

హాలీవుడ్ సినిమాలో దీపికా పదుకునే.. XXX సిరీస్‌లో...

బాలీవుడ్ అందాల రాశి దీపికా పదుకునే మళ్లీ హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేసింది. ట్రిపుల్ ఎక్స్- ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమా ద్వారా దీపికా పదుకునే హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు

బాలీవుడ్ అందాల రాశి దీపికా పదుకునే మళ్లీ హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేసింది. ట్రిపుల్ ఎక్స్- ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమా ద్వారా దీపికా పదుకునే హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు విన్ డీజిల్, డానీ యెన్, రూబీ రోస్ తదితరులు నటించారు. కేవలం 85 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 346 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. 
 
ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్లు దర్శకుడు డీజే కరుసో గతంలోనే తెలిపాడు. తాజాగా దీనిపై కరుసో ట్విట్టర్‌లో స్పందించాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్‌లో వస్తున్న ఈ సినిమాలో చైనా నటుడు రాయ్ వాంగ్ నటిస్తున్నట్లు కరుసో ప్రకటించాడు. 
 
ఇందులో దీపిక కూడా నటిస్తుందని ఓ ప్రశ్నకు జవాబుగా కరుసో తెలిపాడు. పద్మావతి చిత్రం తర్వాత దీపిక ఇప్పటివరకూ ఏ సినిమాను అంగీకరించని సంగతి తెలిసిందే. దీంతో దీపికా పదుకునే రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడనుందని టాక్ వచ్చింది. 
 
కానీ దీపికా హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో నటిస్తుందా..? పెళ్లికి ముందే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.