"ఆ" పని చేస్తూ రణ్‌బీర్ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.. అందుకే బ్రేకప్
బాలీవుడ్ హీరో, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్‌తో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించారు. 2007వ సంవత్సరంలో పలు పత్రికలు వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేక కథనాలే రాసాయి. ఆ తర్వాత అతనికి బ్
బాలీవుడ్ హీరో, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్‌తో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించారు. 2007వ సంవత్సరంలో పలు పత్రికలు వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేక కథనాలే రాసాయి. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి ఇపుడు రణ్‌వీర్ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అయితే, తన తొలి ప్రేమికుడు రణ్‌బీర్‌తో ఉన్న ప్రేమ బ్రేకప్ కావడానికి గల కారణాన్ని దీపికా తాజాగా వెల్లడించింది.
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "శృంగారం అనేది నాకు సంబంధించినంతవరకు శారీరకం వరకే కాదు, అందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. నేను ఒకరితో బంధంలో ఉన్నప్పుడు ఎవరిని మోసం చేయలేదు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే ఆ రిలేషన్ షిప్‌కి విలువేముంది.
అలాంటప్పుడు సింగిల్‌గా ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రణ్‌బీర్ ఒకసారి నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. రెండో అవకాశం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. ఆ ఘటనతో ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మొద్దని తెలిసి రణ్ బీర్‌కి దూరమయ్యాను. మానసికంగా కుంగిపోయిన నేను ఆ విషాదం నుండి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చింది.