శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (08:44 IST)

మహిళలు చూడాలని హస్త ప్రయోగం చేశాడు... ఎక్కడ?

కామాంధుల ఆగడాలు రానురానూ మితిమీరిపోతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా మృగాళ్ళ వికృత చేష్టలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ రైలు

కామాంధుల ఆగడాలు రానురానూ మితిమీరిపోతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా మృగాళ్ళ వికృత చేష్టలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ రైలు బోగీలో ఉన్న ప్రయాణికులను చూస్తూ ఓ కామాంధుడు హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీన్ని ఓ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బందెల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
 
ఈనెల 8వ తేదీ ఆదివారంనాడు బందెల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మహిళలకు కేటాయించిన రైలు బోగీ ఎక్కి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆ బోగీలోని మహిళా ప్రయాణికులంతా చూస్తూవుండగానే ప్యాంటు విప్పి, హస్త ప్రయోగానికి పాల్పడ్డాడు. అతను చేస్తున్న అసభ్య చర్యను చూసిన ఓ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అతను అలాగే తన వికృత చర్యను కొనసాగిస్తుండంతో ఇబ్బందిగా ఫీలైన కొందరు మహిళలు  వెంటనే బోగీ దిగిపోయారు. 
 
ఆ తర్వాత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చెరుకున్న పోలీసులు అతన్ని అదుపులో తీసుకొనే ప్రమత్నం చేయగా అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత మహిళ స్పందిస్తూ, అతను వికృత చేష్టలకు పాల్పడుతున్న సాక్ష్యం కోసమే ఆ వ్యక్తి అసభ్య చర్యను ఫెస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది.