మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (18:01 IST)

ట్యాక్సీ డ్రైవర్‌గా మారనున్న సమంత.. ఎందుకు?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యూటర్న్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. తమిళంలో సమంత ''సీమరాజా'' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలకు తర్వాత ఓ థ్రిల్లర్ మూవీ చేసేందుకు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యూటర్న్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. తమిళంలో సమంత ''సీమరాజా'' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలకు తర్వాత ఓ థ్రిల్లర్ మూవీ చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'కొలాటెరల్' ఘనవిజయాన్ని సాధించింది. 
 
ఆ సినిమా మూలాన్ని తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగినట్లు ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత మునుపెన్నడూ పోషించని ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనుందట. 
 
ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించేందుకు సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మురళీశర్మ, అరుణ్ ఆదిత్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం.