ప్యాంటు విప్పి.. కామాంధుడి వికృత చర్య.. ఎఫ్బీలో లైవ్ వీడియో
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనాల మధ్యలోనే చేయకూడని పనులు చేస్తూ కామాంధులు మహిళలకు విసుగుపుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బందేల
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఓ వైపు పెచ్చరిల్లిపోతుంటే.. కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జనాల మధ్యలోనే చేయకూడని పనులు చేస్తూ కామాంధులు మహిళలకు విసుగుపుట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బందేల్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి మహిళల కూర్చొనే కంపార్ట్మెంట్ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే ప్యాంటు విప్పి వికృత చర్యకు పాల్పడ్డాడు.
ఆ కామాంధుడి అసభ్య ప్రవర్తనను ఓ మహిళ వీడియో తీసి ఫేస్బుల్లో పెట్టేసింది. అతని వికృత చర్యకు ఇబ్బంది పడిన మహిళలు వెంటనే కంపార్ట్మెంట్ దిగి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళల ఫిర్యాదు మేరకు ఆ కామాంధుడి వద్దకు చేరుకున్న పోలీసులను చూసిన అతడు పారిపోయాడు. కాగా సాక్ష్యం కోసమే ఆ వ్యక్తి అసభ్య చర్యను ఫేస్బుక్లో లైవ్లో పెట్టినట్లు మహిళ తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా కామాంధుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చేపట్టారు.