1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (17:17 IST)

నాకు ఆ సినిమాలంటే ఇష్టం.. ఉపాసన వల్లే ఆ సినిమాలు?: చెర్రీ

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనకు బయోపిక్‌లపై గల ఇష్టాన్ని వెల్లడించాడు. తనకు బయోపిక్‌లంటే చాలా ఇష్టమని... తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఉపాసన వల్లే తాను కామెడీ సినిమాలు చ

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనకు బయోపిక్‌లపై గల ఇష్టాన్ని వెల్లడించాడు. తనకు బయోపిక్‌లంటే చాలా ఇష్టమని... తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఉపాసన వల్లే తాను కామెడీ సినిమాలు చూస్తున్నానని.. ఆ విషయంలో ఉపాసనకు ధన్యవాదాలని చెర్రీ తెలిపాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది.
 
ఈ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీలో నటించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బయోపిక్‌ల గురించి మాట్లాడాడు. బయోపిక్‌లలో నిజాలు ఉంటాయని... అందుకే అవి తనకు నచ్చుతాయని చెప్పాడు. అయితే, బయోపిక్‌లో నటించే అవకాశం తనకు వస్తే... ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేనని అన్నాడు. 'సంజు' సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగా నచ్చిందని.. ఆయన గొప్ప యాక్టర్ అని కితాబిచ్చాడు.
 
ఇకపోతే.. బోయపాటితో చెర్రీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ఒక్క సీనుకే భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే చెర్రీ బోయపాటికి సలహా ఇచ్చాడట. బడ్జెట్‌ మరీ అంత అవసరం లేదని.. అనవసరపు ఖర్చును తగ్గించాల్సిందిగా సూచించాడట.