శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:34 IST)

ఆ స్టార్‌ను కలిసి 33 ఏళ్ల చిరకాలవాంఛ తీర్చుకున్న నటి...

సీనియర్ నటి ఖుష్బూకు కేవలం తమిళనాడులోనేకాకుండా దక్షిణాదివ్యాప్తంగా మంచి పేరుంది. ఆమెకు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

సీనియర్ నటి ఖుష్బూకు కేవలం తమిళనాడులోనేకాకుండా దక్షిణాదివ్యాప్తంగా మంచి పేరుంది. ఆమెకు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఈమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఇపుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. అయితే, ఈ అమ్మడుకి 33 యేళ్లుగా ఓ కోర్కె తీరకుండా మిగిలిపోయిందట.
 
ఆ కోర్కె ఏంటో కాదు. తన అభిమాన క్రికెట్ స్టార్‌ను కలుసుకోవాలన్నదే. ఆ స్టార్‌ను కలిసేందుకు గత 33 ఏళ్లుగా పరితపిస్తూ వచ్చిందట. అయితే తొలినాళ్లలో సినిమాల్లో బిజీగా ఉండటం, తర్వాత కుటుంబం, రాజకీయాలతో బిజీగా మారడంతో ఆమెకు ఆ అవకాశం లభించలేదు.
 
తాజాగా ఆమె తన అభిమాన స్టార్‌ను కలుసుకుంది. ఆ స్టార్ ఎవరో కాదు టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి. ఈయనకు ఖుష్బూ పెద్ద అభిమాని, ఆయనను కలవాలని చాలా సార్లు అనుకుంది. అయితే కుదర్లేదు. తాజాగా చెపాక్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా తొలిసారి తన అభిమాన క్రికెట్ స్టార్‌ను కలిసి, తన ముచ్చటు తీర్చుకుంది. ఈ విషయం తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను పోస్టు చేసింది.