గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (01:12 IST)

డ్రైవర్ పని కాదు.. పెద్దకుట్రే ఉంది.. తనపై వేధింపు గురించి పెదవి విప్పిన భావన

షూటింగ్ నుంచి ఇంటికెళుతున్న తనను అపహరించి, కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ధన సంపాదన కోసం జరిగింది కాదని మలయాళ సినీ హీరోయిన్ భావన పేర్కొన్నారు. రెండు నెలల క్రితం తనపై జరిగిన దుర్మార్గంపై తొలి

షూటింగ్ నుంచి ఇంటికెళుతున్న తనను అపహరించి, కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ధన సంపాదన కోసం జరిగింది కాదని మలయాళ సినీ హీరోయిన్ భావన పేర్కొన్నారు. రెండు నెలల క్రితం తనపై జరిగిన దుర్మార్గంపై తొలిసారిగా నోరు విప్పిన భావన తనపై వేధింపు వెనక పెద్ద కుట్రే ఉందని తేల్చి చెప్పారు. సినీ నటులను షూటింగ్ లొకేషన్ నుంచి తీసుకుని వెళ్లే ఒక మామూలు డ్రైవర్ ఒక సినీ హీరోయిన్‌ను తనకారులోనే వేధింపులకు గురిచేసే సాహసానికి ఒడిగట్టడం నమ్మశక్యం కాని విషయమని భావన తెలిపారు.
 
ఇలాంటి దారుణాలపై మౌనంగా ఉండవద్దని, ఇతర బాధితులు కూడా ముందుకొచ్చి తమ గోడును ప్రపంచానికి తెలుపాలని మహిళలకు పిలుపునిచ్చిన భావన ఈ ఘటనపై తన ప్రశ్నలకు, సందేహాలకు సంతృప్తికరమైన సమాధానం ఇంకా రాలేదని, అసలు సమాధానం వచ్చేవరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. డ్రైవర్‌ను సాకుగా పెట్టుకుని ఇంత ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు, ఎందుకలా చేశారు అంటూ తనను తొలిచి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం వచ్చేవరకు ఆ ఘటనపై వచ్చిన పైపై వార్తలను నమ్మలేనని చెప్పారు.
 
అయితే సినీపరిశ్రమలో తనకు శాశ్వత స్నేహితులు, శాశ్వత శత్రువులు కూడా ఉన్నారని భావన అంగీకరించారు. అయితే నేను చేయని తప్పులకు ఎవరికీ తాను క్షమాపణలు చెప్పబోనని, అలా రాజీపడి అవకాశాల కోసం ఎవరివద్దా దేబిరించనని భావన తేల్చి చెప్పారు. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతి పరిచిన భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్న పల్సర్ సునిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.