అమీ జాక్సన్‌కు అబ్బాయి పుట్టాడు... పేరేంటో తెలుసా?

Last Updated: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:38 IST)
రోబో 2 హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండా తల్లి అయ్యింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేసిన ఆమె ఇటీవల గర్భం ధరించింది. ఈ నేపథ్యంలో అమీ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. గర్భంతో కూడిన అమీ జాక్సన్ ఫోటోలు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో పోస్టు చేసింది.

ఈ నేపథ్యంలో అమీజాక్సన్‌ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. తన శిశువు, తన బాయ్‌ఫ్రెండ్‌తో వున్న ఫోటోను అమీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత కొన్ని నెలల క్రితం బిజినెస్‌మెన్ జార్జ్ పనయోట్యూ‌తో ప్రేమాయణం ఆపై సహజీవనం చేసిన అమీ.. ఇటీవల నిశ్చితార్థం జరుపుకుంది.

ఆపై గర్భం తాలూకూ ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. తాజాగా అమీ జాక్సన్ తన బాబు, బాయ్‌ఫ్రెండ్‌తో కూడిన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. '' ఏంజెల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆతని పేరు ''ఆండ్రియాస్'' అంటూ ప్రకటించింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.దీనిపై మరింత చదవండి :