శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (19:02 IST)

హైపర్ ఆది, అనసూయ జబర్దస్త్‌ను వీడట్లేదు.. అదిరే అభి (video)

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ నుంచి హైపర్ ఆది వెళ్లిపోతున్నాడన్న ప్రచారాన్ని అదిరే అభి ఖండించారు. తనకు తమ్ముడి లాంటివాడైన ఆది.. జబర్దస్త్‌ను వీడట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఆది జబర్దస్త్‌లోనే ఉన్నాడని.. ఇకముందు కూడా కొనసాగబోతున్నాడన్నాడు. అంతేగాకుండా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్‌ను వీడుతున్నట్లు జోరుగా జరుగుతున్న ప్రచారానికి అభి ఫుల్ స్టాప్ పెట్టాడు. 
 
అనసూయ కూడా యాంకర్‌గా కొనసాగుతారని అభి చెప్పుకొచ్చాడు. ఒకరిద్దరు షోని వీడినంత మాత్రాన.. జబర్దస్త్ ఆగిపోదని.. ఇంతకుముందు లాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అదే టీఆర్పీ తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయటకు వెళ్లినవారికి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చునని.. దానిపై తానేమీ మాట్లాడలేనని అన్నారు. 
 
ఇక నాగబాబు షో నుంచి వెళ్లిపోవడంపై తాను స్పందించలేనని.. ఆయనపై కామెంట్ చేసేంత స్థాయి తనకు లేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా జబర్దస్త్ తమకు తిండి పెట్టి.. ఒక గుర్తింపునిచ్చిందని గుర్తుచేశారు. జబర్దస్త్ నటుల్లో వివాదాలు తలెత్తాయన్న ప్రచారాన్ని అభి తప్పు పట్టారు. అలాంటిదేమీ లేదని ఎక్కడున్నా ఏం చేసినా.. తామంతా కలిసే ఉంటామని స్పష్టం చేశారు.