శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 జూన్ 2016 (11:41 IST)

జబర్దస్త్ కామెడీ షో కొత్త వివాదం: నర్సింగ్‌లకు అవమానం... సారీ చెప్పాల్సిందే!

జబర్దస్త్ కామెడీ షో మరో వివాదానికి కారణమైంది. ఈ కామెడీ షోలో నర్సులను కించపరిచినట్లు సన్నివేశాలున్నట్లు తెలంగాణ నర్సింగ్ సమితి తీవ్రంగా ఖండించింది. ఇంకా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ ద్వారా బహిరంగ క్షమాపణ చెప్

జబర్దస్త్ కామెడీ షో మరో వివాదానికి కారణమైంది. ఈ కామెడీ షోలో నర్సులను కించపరిచినట్లు సన్నివేశాలున్నట్లు తెలంగాణ నర్సింగ్ సమితి తీవ్రంగా ఖండించింది. ఇంకా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఆందోళన చేస్తామని తెలంగాణ నర్సింగ్ సమితి కోశాధికారి రుడావత్ లక్ష్మణ్ హెచ్చరించారు. 
 
అంతేగాకుండా జబర్దస్త్ టీమ్ తెలుగు రాష్ట్రాల నర్సులకు క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వ నర్సింగ్ యూనియన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటల పాటు నర్సింగ్ సేవలను నిలిపివేసి ఆందోళన మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
 
జూన్ 10న ఒక చానల్‌లో ప్రసార మైన జబర్దస్త్ కార్యక్రమంలో పవిత్రమైన నర్సింగ్ వృత్తిలో ఉన్న నర్సులను అవమానించే విధంగా ప్రసారం జరిగిందని.. అవమానకరమైన స్కిట్ ప్రదర్శనకు బాధ్యులైన జబర్దస్త్ టీమ్ సభ్యులందరూ బహిరంగంగా సారీ చెప్పాలని.. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.