'శ్రీమంతుడు' కంటే 'జనతా గ్యారేజ్' బెటర్ సినిమా : కొరటాల శివ
'శ్రీమంతుడు' కంటే 'జనతా గ్యారేజ్' బెటర్ సినిమా అంటూ వచ్చిన కాంప్లిమెంట్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. నా జీవితంలో విలువైన, సంతోషకరమైన రోజు. ఇంత భారీ అంచనాలు నడుమ
'శ్రీమంతుడు' కంటే 'జనతా గ్యారేజ్' బెటర్ సినిమా అంటూ వచ్చిన కాంప్లిమెంట్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు. నా జీవితంలో విలువైన, సంతోషకరమైన రోజు. ఇంత భారీ అంచనాలు నడుమ విడుదలైన సినిమాకు అన్నిచోట్ల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఫస్ట్ వీక్‌లోనే సేఫ్ అయిపోతామని చెప్పారు. 'శ్రీమంతుడు' కంటే బెటర్ సినిమా అని చెప్పడం ఆనందాన్నిస్తుందని అన్నారు. ఎన్టీఆర్, సమంత, నిత్య హీరో హీరోయిన్లుగా, మోహన్‌లాల్ పధ్రాన పాత్రలో నటించిన చిత్రం రెండువేల థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు శివ మాట్లాడుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాలే తీయ్ అని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇంత పెద్ద రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మైత్రీలో రెండో విజయం. నాకు హ్యాట్రిక్ మూవీ అయ్యింది. ఇది ఇంకా మంచి సినిమాలు తీయాలని నా బాధ్యతను మరింత పెంచింది. అనుకున్నది అనుకున్నట్లు తీశాం. కేరళ నుంచి మోహన్‌లాల్‌గారు ఫోన్ చేసి, నేను చేసింది డబ్బింగ్ మూవీ అయినా నా బ్లాక్‌బస్టర్ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చిందన్నారు.
ఇద్దరు స్టార్ హీరోలను హ్యండిల్ చేయగలమా అనుకున్నాం కానీ ఇప్పుడు థియేటర్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇద్దరినీ ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ కావడం ఎవరూ ఇష్టం లేదు. ఇలాంటి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి సినిమా ఇంకా హైట్స్‌కు రీచ్ అవుతుంది. సినిమాలో కంటెంట్ బావుందని అందరూ అంటున్నారు. సినిమా చూసిన పెద్దవారైతే నాకు ఫోన్ చేసి ఈ మధ్య ఇలాంటి సినిమా చూడలేదంటూ ఫోన్ చేస్తున్నారు. ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. ఫ్యాన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.