గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (16:02 IST)

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

Jani Master
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టిని లైంగికంగా వేధించిన కేసులో సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై జానీ మాస్టర్ భార్య ఆయేషా స్పందించారు. తన భర్త లైంగికదాడికి పాల్పడినట్టుగా నేరాన్ని అంగీకరించారంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా మీడియా దుష్ప్రచారం మాత్రమేనని ఆమె తెలిపారు. 
 
జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగికదాడి కేసులో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీస్ విచారణలో జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, థంబ్ నెయిల్స్‌పై ఆయన భార్య ఆయేషా స్పందించారు. ఓ ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జానీ మాస్టర్‌పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
 
జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నారంటూ మీడియాలో థంబ్‌నెయిల్స్ పెడుతున్నారని, అదంతా అవాస్తవమన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందన్నారు. ఆమె ఏమి ఆశిస్తుందో తెలియదని అన్నారు. తన భర్తపై చేసిన ఆరోపణలను న్యాయస్థానంలోనే తేల్చుకుంటామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా అని ఆయేషా ప్రశ్నించింది.
 
తనకు మాస్టర్ లైఫ్ ఇచ్చారని చెప్పిన అమ్మాయి.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించి వేధించాడని చెప్పడం తమకే ఆశ్చర్యంగా ఉందన్నారు. చెప్పుడు మాటలు విని ఆ అమ్మాయి ఇలా చేసి ఉండవచ్చని ఆయేషా అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఓ పెద్ద హీరో ఉండి నడిపిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అది అవాస్తవమని ఆయేషా అన్నారు.