సంబంధిత వార్తలు
- జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?
- జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి
- నా ముందు అన్నయ్య అని పిలిచేది.. ఇది హనీ ట్రాప్: జానీ మాస్టర్ భార్య
- జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్
- గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్.. హైదరాబాద్ రహస్య ప్రాంతంలో విచారణ
పుష్ప సెట్‌లో జానీ కొట్టాడు.. పవన్ అందుకే కామ్‌గా వున్నాడు.. మాధవీలత
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ నటి మాధవీలత స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్‌ను మైనర్‌గా ఉన్న టైంలోనే లొంగదీసుకున్నాడని, పెళ్లి, మత మార్పిడి అంటూ ఆమెను వేధించాడని మాధవీ లత ఆరోపించింది.
బాధితురాలు అతనికి దూరం కావాలనుకున్నా వదల్లేదని.. తనంతట తాను బతికేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మాధవీలత వెల్లడించింది. ఇక ఆమెకు మిస్ యూ, లవ్యూ, మ్యారీ మీ అంటూ వందల, వేల మెసెజ్‌లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది.
పుష్ప 2 సెట్‌లో ఆమెను అందరి ముందే కొట్టాడు. సుకుమార్ పంచాయితీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు. అన్ని విషయాలు అల్లు అర్జున్‌కి తెలుసు కాబట్టే ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నాడు. ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది.
అన్నీ తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు వేయడం తనకు నచ్చలేదు అని మాధవీలత చెప్పుకొచ్చింది. ఆయనకు ఓ కూతురుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని మాధవీలత పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు అంతా తెలుసు కాబట్టే కామ్‌గా వున్నారని మాధవీలత వెల్లడించింది.
Madhavi Latha ✅
— Ravi @????????Prabhas Army ???????????? (@RaviPrabhas333) September 22, 2024
Those who are standing by Jani Master, are the worst of human beings. Period
pic.twitter.com/A8RdJKDvWU
